అర్జీలు స్వీకరించిన మంత్రి కొల్లు రవీంద్ర

అర్జీలు స్వీకరించిన మంత్రి కొల్లు రవీంద్ర

కృష్ణా: మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార చర్యలకై సంబంధిత అధికారులకు అర్జీలను బదిలీ చేశారు.