గిద్దలూరులో సబ్ జైలును సందర్శించిన న్యాయమూర్తులు
ప్రకాశం: గిద్దలూరులోని సబ్ జైలును జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికారుల సంస్థ సెక్రటరీ ఇబ్రహీం షరీఫ్, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కె.భరత్ చంద్ర, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఓంకార్ గురువారం సందర్శించారు. ఇందులో భాగంగా జైలులో ఖైదీల బాగోగులు, జైలులోని సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి అందించే ఆహారంపై ఆరా తీశారు.