నందివాడలో జూద శిబిరాలపై దాడి

కృష్ణా: నందివాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుట్టగుంట గ్రామంలో పోలీసులు జూద శిబిరాలపై దాడులు నిర్వహించారు. అక్రమంగా జూదం నిర్వహిస్తున్న వారిపై దాడి చేసి 9 మంది వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 8 మోటార్ సైకిళ్లు, 2 కోడి పుంజులు, 2 కత్తులు, రూ.8,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు. నందివాడ పరిధిలో ఎవరైన అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.