పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈవో

పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈవో

PPM: మన్యం జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DEO పి. బ్రహ్మాజీరావు తెలిపారు. జిల్లాలో మొత్తం 68 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడినట్లు తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలోని 222 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 10,646 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు.