రెవెన్యూ అంశాలపై అధికారులకు శిక్షణ

అన్నమయ్య: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. గురువారం మదనపల్లె సమీపంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల నందు రెవెన్యూ అంశాలపై అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్, మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డివిజన్ అధికారులు పాల్గొన్నారు.