'కార్మికులంతా ఐక్యంగా ఉండాలి'

HYD: కార్మికులంతా ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని సీఐటీయూ మండల కన్వీనర్ డప్పు ప్రవీణ్ కుమార్ అన్నారు. వచ్చేనెల 20న చేయనున్నట్లు సమ్మె నోటీసును మణికొండ మున్సిపాలిటీ కమిషనర్ ప్రదీప్ కమార్‌కు అందజేశారు. మే 1న జరిగే 139వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని దీక్షా దినంగా జరపాలన్నారు. కార్మిక వర్గ ప్రతిఘటన వల్లే 8 గంటల పని దినం చట్టం వచ్చిందన్నారు.