'సమస్యలు పరిష్కరించడమే ప్రజా దర్బార్ లక్ష్యం'
VZM: ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రజాదర్బార్ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం గజపతినగరంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు సమస్యలను మంత్రికి వినతి పత్రాల ద్వారా వివరించారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి వారికి తెలిపారు.