'జీతాలు, డైట్ బిల్లులు చెల్లించాలి'

'జీతాలు, డైట్ బిల్లులు చెల్లించాలి'

PPM: గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు, సిబ్బంది జీతాలు, వసతి గృహాలకు డైట్ బిల్లులు చెల్లించాలని గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు పల్ల సురేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బందికి జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. వసతి గృహాలకు రెండు నెలల వరకు డైట్ బిల్లులు లేవని, దీనివల్ల వార్డెన్లు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.