'ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలి'
SRCL: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేయాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ మేరకు 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా 99 రోజుల కార్యాచరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో వారోత్సవాలు నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలో గురువారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సేవలను ప్రారంభించారు.