ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
SKL: పలాస మండలం బొడ్డ పాడు గ్రామంలో జై భీమ్ యువజన సంఘం 31వ వార్షికోత్సవ సందర్భంగా జెమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శిరీష పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడితూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య అవగాహన చాలా అవసరమని అన్నారు.