నామినేషన్ల దాఖలుకు నేడు చివరి రోజు

ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల దాఖలుకు ఇవాళ చివరి రోజు. ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేయగా, 'ఇండి' కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ల పరిశీలన రేపు జరగనుంది. ఈ నెల 25 నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా ఉంది. సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు కూడా వెలువడనున్నాయి.