సమ్మెకు మద్దతు తెలిపిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ
JN: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులు చేస్తున్న సమ్మెకు TRP తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జనగామ డిపో వద్ద కొనసాగుతున్న కార్మికుల నిరసనలో పార్టీ జిల్లా నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సరికాదని మండిపడ్డారు.