పాఠశాల ప్రహరీగోడ నిర్మాణానికి భూమి పూజ
SRD: రాయికోడ్ మండలం మహాబత్ పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రహరీగోడ నిర్మాణ పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఆర్.కృష్ణ ఆధ్వర్యంలో ఏఈ దేవయ్య, సర్పంచ్ లక్ష్మణ్, ఉప సర్పంచ్ విజయ్ కుమార్ కలిసి భూమి పూజ నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిత, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.