మహిళలు అన్నిరంగంలో సాధించాలి: ఎంపీపీ
ELR: మహిళల జీవితంలోని ప్రతి అంశంలో సాధికారత, రక్షణ కల్పించేలా యాప్ రూపొందించబడిందని ఉంగుటూరు ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి అన్నారు. బుధవారం ఉంగుటూరు శాఖ గ్రంథాల వారోత్సవాలు సందర్భంగా అభయ యాప్ మహిళ సాధికారతపై చర్చ జరిగింది. ఎంపీపీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి శ్రీదేవి, పశువైద్యాధికారి డాక్టర్ శిరీష పాల్గొన్నారు.