30వ తేదీ నుంచి రామానుజాచార్యుల మహోత్సవాలు

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 30 నుంచి మే 2వ తేదీ వరకు శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ భగవద్ రామానుజాచార్యులపై సాహితీ సదస్సు, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.