నియోజకవర్గానికి సీఎం వరాల జల్లు
SRD: హుస్నాబాద్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి వరాలు కురిపించారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రూ.262.78 కోట్లతో హుస్నాబాద్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనా చేశారు. అన్ని రంగాల్లో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు.