బడా బాబులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: వైసీపీ
NDL: టీడీపీ నకిలీ మద్యం విధానంపై వైసీపీ సమన్వయ కర్త డాక్టర్ ధారా సుధీర్ ఆధ్వర్యంలో నంది కోట్కూరు పట్టణంలో ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన ర్యాలీ చేశారు. అనంతరం ఎస్సై జఫ్రూల్లాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నకిలీ మద్యం పాలసీ సూత్ర దారులను అరెస్టు చేయాలన్నారు. నకిలీ మద్యం తయారీ వెనుక ఉన్న బడా బాబులను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు.