గంగమ్మకు వెండి ఆభరణాల విరాళం

TPT: తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సోమవారం కడియాలు, కాళ్ల పట్టీలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, శ్యాప్ ఛైర్మన్ రవి నాయుడు అందించారు. టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి మహేశ్ యాదవ్ అర కేజీ వెండితో అమ్మవారికి కడియాలు, కాళ్ల పట్టీలు తయారు చేయించారు. వీటిని అమ్మవారి దర్శనం అనంతరం కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే, శ్యాప్ ఛైర్మన్ చేతుల మీదుగా ఈవో జయ కుమార్‌కు అందజేశారు.