IPL.. బెట్టింగ్ ఊబిలో పడొద్దు: సజ్జనార్
IPL మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను క్రీడగానే ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితం నాశనం చేసుకోవద్దని HYD CP సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్ దందా యాప్‌ల్లోనే కాక టెలీగ్రామ్, వాట్సాప్ వేదికగానూ సాగుతోందని.. ఈ మాఫియాతో అప్పులపాలై రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. బెట్టింగ్, బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.