జనవరి నాటికే ఐటీఆర్‌ ఫారాలు: సీబీడీటీ చీఫ్‌

జనవరి నాటికే ఐటీఆర్‌ ఫారాలు: సీబీడీటీ చీఫ్‌

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఐటీఆర్ ఫారాలు ముందుగానే అందుబాటులోకి రానున్నాయి. 2026 జనవరి నాటికే 2025 కింద ఐటీఆర్ ఫారాలను, నిబంధనలను నోటిఫై చేయనున్నట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చీఫ్ రవి అగర్వాల్ తెలిపారు. తద్వారా కొత్త ఆదాయ చట్టాన్ని, నూతన ప్రక్రియను అర్థం చేసుకోవడానికి పన్ను చెల్లింపుదారులకు తగిన సమయం దొరుకుతుందని వెల్లడించారు.