VIDEO: సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని గిరిజనులు నిరసన

AKP: తమ గ్రామాలకు నెట్ వర్క్ సౌకర్యం కల్పించాలని రావికమతం మండలం టీ.అర్జాపురం పంచాయతీ పాత కొట్నాబెల్లి, రామన్నపాలెం, గదబపాలెం ఆదివాసీ గిరిజనులు శుక్రవారం నిరసన చేపట్టారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ కోసం ఫోన్ చేయాలంటే సిగ్నల్ కోసం కొండ ఎక్కాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. తక్షణమే సెల్ టవర్లు ఏర్పాటు చేసి నెట్వర్క్ సౌకర్యం కల్పించాలని కోరారు.