శునకాలకు వింత వ్యాధి.. బెంబెలెత్తుతున్న జనం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శునకాలను చూసి జనాలు జంకుతున్నారు. శునకాలు గుంపులు గుంపులుగా తిరిగి జనాలను భయపెడుతుంటే మరికొన్ని శునకాలకు వింత వ్యాధితో జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అధికారులు స్పందించి వ్యాధికి గురైన శునకాలను జనావాసాలకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.