సిలగాంలో పంటనష్టం పరిశీలించిన ఎమ్మెల్యే గొండు శంకర్
SKLM: గార పంచాయతీ సిలగాం గ్రామంలో తుఫాన్ ప్రభావంతో దాదాపు నాలుగు ఎకరాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పంటనష్టం పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించడానికి శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ఈరోజు గ్రామాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే శంకర్ రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.