మహిళా రక్షణపై అవగాహన సదస్సు

మహిళా రక్షణపై అవగాహన సదస్సు

NDL: బేతంచర్ల నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ హరిప్రసాద్ అధ్యక్షతన మహిళా రక్షణపై అవగాహన సదస్సు ఇవాళ నిర్వహించారు. సీఐ వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. మహిళలు అఘాయిత్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. అన్యాయం జరిగితే వెంటనే 1930 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాల సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.