శ్రీ రంగనాథస్వామికి ప్రత్యేక అలంకరణ

శ్రీ రంగనాథస్వామికి ప్రత్యేక అలంకరణ

ATP: తాడిపత్రి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆలూరుకోనలో ధనుర్మాసం ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం శ్రీదేవి, భూదేవి సమేత శేషతల్ప శ్రీరంగనాథస్వామికి విశేష అలంకరణ చేశారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రంగనాథుని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.