సహస్త్ర లింగాల దేవాలయంలో ఘనంగా అన్న పూజ

JGL: జగిత్యాల మండలం పొలాస గ్రామంలోని సహస్ర లింగాల దేవాలయంలో సోమవారం అన్న పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ముగ్గురమ్మలకు వేద పండితుల పూజల నడుమ కన్నుల పండవగా పూజలు నిర్వహించారు. పార్వతి, లక్ష్మీ, సరస్వతి అమ్మవార్లకు ఆనవాయితీగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రావణమాసం సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.