అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో మార్పు
కాకినాడ జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాల పనివేళల్లో మార్పు చేసినట్లు జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారిణి లక్ష్మి తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఈ కేంద్రాలు మే 31వ తేది వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయన్నారు. ఆహారం వడ్డించిన తర్వాత పిల్లలను సురక్షితంగా ఇంటికి పంపాలని అధికారులకు సూచించారు.