యువ రైతు ఉరివేసుకుని ఆత్మహత్య

NDL: బనగానపల్లె మండలం కైప గ్రామంలో శుక్రవారం యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కైప గ్రామానికి చెందిన వెంకట రమణారెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఈ మేరకు అప్పుల బాధ భరించలేక గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.