యండమూరులో పర్యటించిన ఎమ్మెల్యే నానాజీ
KKD: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. 'రైతన్న-మీకోసం' కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన యండమూరులో పర్యటించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు చేశారు. రైతు దేశానికి వెన్నెముక అనే నినాదంతో ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం పని చేస్తున్నారన్నారు.