VIDEO: వేలంగిలో అగ్నిప్రమాదం.. పశువుల పాక దగ్ధం
KKD: కరప మండలం వేలంగిలో శనివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో తిరంశెట్టి వీరబాబుకు చెందిన పశువుల పాక పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పశువులకు గాయాలయ్యాయి. లోపల ఉన్న సామాగ్రి కాలిబూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కరప పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.