రొళ్లలో వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు

సత్యసాయి: రొళ్ల మండలంలో పలువురు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. సోమవారం మడకశిర పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రొళ్ల మండలంలోని ఆర్. గొల్లహట్టి గ్రామానికి చెందిన రంగప్ప, లక్కప్ప,కెంపెగౌడ్,రెడ్డప్ప, పాండురంగప్ప, పూజారి గోవిందప్ప, ముద్దు రెడ్డి, మంజునాథ్ తదితరులతో పాటు 10 కుటుంబాలు వైసీపీనీ వీడి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు సమక్షంలో టీడీపీలో చేరారు.