అక్రమంగా రేషన్ తరలిస్తే చర్యలు తప్పవు: SI
KDP: అక్రమంగా రేషన్ తరలింపు చేస్తే కఠినమైన చర్యలు తప్పవని ఎస్సై హారిక హెచ్చరించారు. శుక్రవారం సిద్ధవటంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె మాట్లాడుతూ.. పల్లె ప్రాంతాల్లో రేషన్ కొనుగోలు చేసి తరలింపు చేస్తున్న దందాపై ఉక్కు పాదం మోపుతామన్నారు. కోడి పందేలు, జూదం అక్రమ రేషన్ తరలింపు చేస్తున్న వ్యక్తులపై సమాచారం తెలిస్తే 9121100581, 9121100584 నెంబర్లకు తెలపాలన్నారు.