సింగూర్‌కు వరద పోటు.. ఒక గేటు ఎత్తివేత

సింగూర్‌కు వరద పోటు.. ఒక గేటు ఎత్తివేత

SRD: పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 9వ గేట్‌ను ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు ఓపెన్ చేసి 1.50 మీటర్ ఎత్తులో దిగువకు వరద జలాలు వదిలినట్లు ప్రాజెక్టు ఏఈఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి 9230 క్యూసెక్కులు ఇన్ ఫ్లో అవుతుండగా... 9675 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నదిలోకి వెళ్తున్నట్లు వివరించారు.