రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన ఇవాళ మెరకముడిదాం మండలం ఉత్తరాపల్లి వద్ద చిలకపాలెం- రాయగడ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో పాడైపోయిన రోడ్లు నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.