టెట్ పరీక్షకు 1,805 మంది హాజరు

టెట్ పరీక్షకు 1,805 మంది హాజరు

EG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) రెండవ రోజు ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు తెలిపారు. స్థానిక లూధర్ గిరిలో గల రాజీవ్ గాంధీ కళాశాలలో మొదటి షిఫ్ట్‌లో 955 మందికిగాను 907 మంది హాజరయ్యారని, 48 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం షిఫ్ట్‌లో 955 మందికి 898 మంది హాజరవగా.. 57 మంది గైర్హాజరైనట్టు డీఈవో తెలిపారు.