వైభవోపేతంగా సత్యనారాయణ స్వామి వ్రతం

వైభవోపేతంగా సత్యనారాయణ స్వామి వ్రతం

NLR: నగరంలోని వీ.ఆర్‌.సీ మైదానం వేదికగా నిర్వహిస్తున్న కార్తీక మాస లక్ష దీపోత్సవం జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పాల్గొని మూడో శనివారం కావడంతో విశేష చండీ హోమం నిర్వహించారు. అనంతరం 501 మంది దంపతులచే సామూహిక శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతం వైభవంగా చేసినట్లు తెలిపారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.