సకాలంలో పోష‌కాహారాన్ని అందించాలి: జేసీ

సకాలంలో పోష‌కాహారాన్ని అందించాలి: జేసీ

VZM: జిల్లాలోని 2,499 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పోషకాహారం సకాలంలో అందేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఎస్‌.సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. సరుకుల సరఫరాలో జాప్యం లేకుండా, నాణ్యమైన బియ్యం, పప్పు, నూనె అందించాలన్నారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ డైరెక్టర్ విమల రాణి పాల్గొన్నారు.