అరుదైన దృశ్యం: ఒకే ఫ్రేమ్‌లో మోదీ, సోనియా
రాష్ట్రపతి భవన్‌లో అధికార, ప్రతిపక్ష నేతలు ఒకే చోట చేరిన అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజ్యసభ సభ్యుల వీడ్కోలు సమావేశం అనంతరం ప్రధాని మోదీ, సోనియా గాంధీ, ఖర్గే, కేంద్ర మంత్రులు ఇతర ఎంపీలందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. రాజకీయంగా మాటల యుద్ధం నడిచే వేళ, నేతలందరూ ఇలా చిరునవ్వుతో ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.