కారుణ్య నియామకాల వేగవంతం
TPT: సీఎం నారా చంద్రబాబు నాయుడు చొరవతో విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాలు వేగంగా కొనసాగుతున్నాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 500 మందికి పైగా నియామకాలు చేపట్టగా, అర్హులైన కుటుంబాలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. విద్యుత్ కొనుగోళ్లు తగ్గించడంలో సీఎం సూచనలు కీలకమని మంత్రి పేర్కొన్నారు.