'రైస్ మిల్లులతో రైతులకు లాభం చేకూరుతుంది'
VZM: రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఆదివారం రేగిడి మండలం తోకలవలస గ్రామంలో నూతనంగా నిర్మించిన రైస్ మిల్లును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం దిగుబడి ఉన్న ప్రాంతాల్లో అధునాతన రైస్ మిల్లును నెలకొల్పడంతో రైతులకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. అన్నదాతల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రైస్ మిల్లును సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.