సారంగాపూర్: అడెల్లికి పోటెత్తిన భక్తులు

NRML: సారంగాపూర్ మండలంలోని అడెల్లి మహా పోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. నిర్మల్ జిల్లాతో పాటు మహారాష్ట్ర, ఇతర జిల్లాలకు చెందిన భక్తులు నిత్యం అమ్మవారిని పెద్ద సంఖ్యలో దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలను భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు.