రేపు సిరిపురం గ్రామానికి మందకృష్ణ మాదిగ రాక
SRPT: నడిగూడెం మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో రేపు నిర్వహించనున్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నారు. సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని నడిగూడెం మండల జై భీమ్ యువజన సంఘం సభ్యులు తెలిపారు.