ఆందోలులో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో
SRD: దేశ రక్షణ వ్యవస్థను అవమానపరిచేలా CM రేవంత్ మాట్లాడారని ఆరోపిస్తూ.. ఆందోలు ప్రధాన రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. అందులో భాగంగా జిల్లా నాయకులు శివచంద్ర మాట్లాడుతూ... ఒక వర్గం ఓట్ల కోసం సీఎం దిగజారేలా మాట్లాడడం సరికాదని చెప్పారు. దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూమయ్య, నందకుమార్, మహేందర్‌లు పాల్గొన్నారు.