నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BDK: ములకలపల్లిలో లైన్ మెయింటెనెన్స్ (రోడ్డు వైన్డింగ్ వర్క్) పనుల వల్ల శుక్రవారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని గురువారం విద్యుత్ శాఖ ఏఈ నరేష్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలో మాత్రమే ఈ అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఏఈ కోరారు.