సంగారెడ్డి నుంచి రేగోడు మీదుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం

SRD: సంగారెడ్డి నుంచి రేగోడ్ మీదుగా ఖేడ్‌కు ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రారంభించినట్లుగా డిపో మేనేజర్ ఉపేందర్ మంగళవారం తెలిపారు. ఈ బస్సు సంగారెడ్డి నుంచి ఉదయం 10:30 గంటలకు బయలుదేరి రేగోడ్ మీదుగా ఖేడ్‌కు 12 గంటలకు చేరుకుంటుందని, తిరుగు ప్రయాణం 12:30 బయలుదేరి రేగోడ్ మీదుగా మధ్యాహ్నం 2:30 గంటలకు సంగారెడ్డికి చేరుకుంటుందన్నారు.