తెలంగాణలో ఎన్నో పోరాటాలు జరిగాయి: సీఎం
TG: తెలంగాణ నేల చైతన్యవంతమైన నేల అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్.. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో పోరాటాలు జరిగాయన్నారు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోయామన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామని పేర్కొన్నారు.