'బీసీ కార్పొరేషన్‌కు పది వేల కోట్లు కేటాయించాలి'

'బీసీ కార్పొరేషన్‌కు పది వేల కోట్లు కేటాయించాలి'

 HYD: బీసీ కార్పొరేషన్‌కు రూ.10 వేల కోట్లు కేటాయించి, ప్రతి కుటుంబానికి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ఆర్‌.కృష్ణయ్య డిమాండ్ చేశారు. 'బీసీ బంధు' ద్వారా రూ.10 లక్షల ఆర్థికసాయం అందించి BCను ఆదుకోవాలని కోరారు. 2024లో దరఖాస్తు చేసుకున్న 6.80 లక్షల మందికి రుణాలు పెండింగ్‌లో ఉండటం వల్ల కులవృత్తులు దెబ్బతింటున్నాయని, వెంటనే వాటిని మంజూరు చేయాలని సీఎంకి విజ్ఞప్తి చేశారు.