భారీ విగ్రహాలతో ప్రాణాలకే ప్రమాదం

W.G: గణపతి ఉత్సవాలు వస్తున్న సందర్భంగా యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తమ విగ్రహమే పెద్దగా ఉండాలనే ఉద్దేశంతో భారీ విగ్రహాలు కొనుగోలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని మండపాలకు తరలించే క్రమంలో విద్యుత్ తీగలకు బలై తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగల్చుతున్నారు. చిన్నపాటి ఆనందం కోసం ప్రాణాలను నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదు. చిన్న విగ్రహాలు కొనేందుకే ప్రయత్నించండి.