ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడిగా నేరెళ్ల
GNTR: మంగళగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నేరెళ్ల మురళిని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు దేవతీ భగవన్నారాయణ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఈ పదవిని కేటాయించినందుకు భగవన్నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.