VIDEO: భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్

SRCL: శ్రీ భగీరథ మహర్షికి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆదివారం శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలను నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ముందుగా శ్రీ భగీరథ మహర్షి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు.